: హైవేపై రక్షణ ఏర్పాట్లు లేకనే బాషాకు ప్రమాదం: నారాయణ


సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ టీడీపీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా మృతిపై స్పందించారు. హైవేపై సరైన రక్షణ ఏర్పాట్లు లేకనే బాషా ప్రమాదానికి గురయ్యారని ఆరోపించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, ఈ ఘటనతోనైనా ప్రభుత్వం మేలుకొని హైవేపై రక్షణ ఏర్పాట్లు చేయాలని నారాయణ సూచించారు. జాతీయ రహదారులపై నిత్యం వేలమంది ప్రయాణిస్తుంటారని, హైవేలను కలుపుతూ సర్వీసు రోడ్లు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోందని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా బాషా మరణంతో కమ్యూనిస్టులకు ఓ మంచి మిత్రుడు దూరమయ్యాడని నారాయణ విచారం వ్యక్తం చేశారు. బాషా మృతికి సంతాపం ప్రకటించిన నారాయణ ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.

  • Loading...

More Telugu News