: కెప్టెన్ గా నిరూపించుకున్న పుజారా


చటేశ్వర్ పుజారా భారత క్రికెట్ కు దొరికిన ఆణిముత్యం. ఇది అందరూ అంగీకరించే మాటే. బ్యాటింగ్ లో రాహుల్ ద్రావిడ్ తర్వాత ఎవరన్న ప్రశ్నకు జవాబులా బాసిల్లుతోన్న ఈ సౌరాష్ట్ర యువకెరటం, ఇప్పుడు కెప్టెన్సీ పరంగానూ మంచి మార్కులే కొట్టేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాలో ముగిసిన 'ఎ' జట్ల ముక్కోణపు టోర్నీలో భారత్ ఎ జట్టుకు సారథ్యం వహించిన పుజారా టైటిల్ సాధనలో కీలకపాత్ర పోషించాడు. దక్షిణాఫ్రికా-ఎ, ఆస్ట్రేలియా-ఎ జట్లు కూడా పాల్గొన్న ఈ టోర్నీలో భారత్ అదరగొట్టింది. నిన్న జరిగిన ఫైనల్లో భారత్-ఎ.. 50 పరుగుల తేడాతో ఆసీస్-ఎ జట్టును చిత్తు చేసింది. ఈ టైటిల్ సమరంలో తాము నమోదు చేసింది 243 పరుగుల స్వల్ప స్కోరే అయినా.. బౌలర్లను సమయానుకూలంగా మార్చడంలో పుజారా ప్రజ్ఞ చూపాడు. దీంతో, కంగారూలు 193 పరుగులకే చాపచుట్టేశారు.

  • Loading...

More Telugu News