: వైఎస్సార్ కాంగ్రెస్ కు నటుడు శ్రీహరి రాజీనామా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నటుడు శ్రీహరి ఈరోజు రాజీనామా చేశారు. అనంతరం ఆయన అభిమానుల మధ్య తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. శ్రీహరి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. కూకట్ పల్లి టికెట్ విషయమై ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి హామీ కూడా లభించినట్లు తెలుస్తోంది.