: భారీవర్ష సూచన
పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు బలంగా ఉండడంతో రానున్న 48 గంటల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. అలాగే, తెలంగాణ, రాయలసీమలోనూ విస్తారంగా వర్షాలు పడతాయని పేర్కొంది.