: బాషా కుటుంబ సభ్యులకు చంద్రబాబు ఓదార్పు


నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఉన్న లాల్ జాన్ బాషా మృత దేహాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు సందర్శించి నివాళి అర్పించారు. కొద్ది సేపటి క్రితమే ఆయన పార్టీ నేతలతో కలిసి నల్గొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉన్న బాషా కుటుంబ సభ్యులను చంద్రబాబు ఓదార్చారు. పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వారికి ధైర్యాన్నిచ్చారు. పార్టీ నేతలు రోడ్డు ప్రమాదాల్లో దూరం కావడం తమను కలచివేస్తోందన్నారు. కొంత కాలం క్రితం ఎర్రన్నాయుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News