: ధర్మవరంలో వెయ్యి అడుగుల జెండా రెపరెపలు
అనంతపురం జిల్లా ధర్మవరం విద్యార్థులు తమ దేశాభిమానాన్ని అంతే గొప్పగా చాటుకున్నారు. వెయ్యి అడుగుల పొడవున్న భారత పతాకాన్ని ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో ఊరేగించారు. దాంతో వీధులన్నీ పతాక రెపరెపలతో సందడిగా, దేశభక్తితో నిండిపోయాయి.