: పతాకావిష్కరణ కోసమంటూ 'వెళ్ళిపోయాడు': చంద్రబాబు


తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ఉదయం మరణించిన పార్టీ నేత లాల్ జాన్ బాషా మృతదేహాన్ని సందర్శించారు. నల్గొండ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న బాబు విగత జీవిగా మారిన తన పార్టీ సహచరుణ్ణి చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. అనంతరం తమాయించుకుని, ఆయనతో తన అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. బాషా వ్యక్తిత్వం సమున్నతమంటూ కీర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గుంటూరులో పతాకావిష్కరణ చేయాలంటూ బాషా తనతో చెప్పారని, అంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని బాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న బాషా ఎవరికీ చెడు తలపెట్టే వ్యక్తి కాడని పేర్కొన్నారు. ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తాడని తెలిపారు. ఓ మంచి నాయకుణ్ణి కోల్పాయమన్నారు.

  • Loading...

More Telugu News