: మెమరీకి మూలం ఇదే
మన మెదడులో జ్ఞాపకశక్తికి మూలమైన అంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనలో కొందరికి అపారమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మరికొందరికి జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటుంది. అయితే ఇలా జ్ఞాపకశక్తికి ప్రేరణను కలిగించే మూలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు మెదడు కణాల్లో జ్ఞాపక నిర్మాణ చర్యను పెంచే, తగ్గించే ప్రోటీన్‌ను గుర్తించారు. మన మెదడులోని సంక్లిష్టమైన సంకేతాల వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఇది కీలకంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. 'ఏజీఏపీ3' అనే ప్రోటీన్ రెండు రకాలుగా పనిచేస్తుండటం శాస్త్రవేత్తలకు ఆసక్తికరంగా కనిపించింది. ఒకవైపు మెదడు కణాల మధ్య అనుసంధానాలను పెంచుతూ, మరోవైపు మెదడు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కణాలమధ్య అనుసంధాన చర్య తగ్గడానికి ఇది తోడ్పడుతోందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న రిక్ హుగనిర్ చెబుతున్నారు.