: 'చల్ల'గా వెళ్లిరండి


మీరు ఎండలో బయటికి వెళ్లాల్సివస్తే ఇకపై చల్లగా వెళ్లొచ్చు. ఎండలో చల్లగా ఎలా వెళ్లిరావాలి అనుకుంటున్నారా... మీరు ఎండలో ఉన్నా కూడా మీరు మాత్రం చక్కటి వాతావరణంలో ఉండేలాగా ఒక కొత్త రకం చొక్కాను పరిశోధకులు రూపొందించారు. ఈ చొక్కా ఎండ వేడి ప్రభావాన్ని మీపై పడకుండా చూస్తుంది.

ఆష్ట్రేలియా కార్ల్‌రుహే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (కిట్‌)కి చెందిన విల్‌ హెమ్‌ స్టార్క్‌ అనే శాస్త్రవేత్త ఒక చొక్కాను రూపొందించారు. ఈ చొక్కా చక్కగా మన శరీరంపై వేడి వాతావరణ ప్రభావం నియంత్రిస్తుందట. వేసవి వేడినుండి ఈ చొక్కా ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా, మన శరీరాన్ని చల్లగా ఉండేలా చేస్తుందట. మన శరీరంలో పట్టే చెమటను ఎప్పటికప్పుడు ఆవిరి చేసి చల్లగా మారేలాగా ఈ చొక్కాలో నిత్యం గాలి తిరుగుతూ ఉంటుంది. అందుకు అనువుగా ఇందులో చిన్న చిన్న ఖాళీలు ఉంటాయి. లోపలి గాలిలోని చల్లదనాన్ని అవసరమైన మేర నియంత్రించేందుకు చేతి గడియారం లాంటి పరికరం చూడా ఇందులో ఉంటుంది. ఇలాంటి వ్యవస్థ ఉన్న చొక్కా బరువు మాత్రం కేవలం 200 గ్రాములేనని స్టార్క్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News