: క్యాన్సర్‌ వ్యాధికి ఈ తరహాలో కూడా చికిత్స చేయవచ్చు


రక్తంలో ప్లేట్‌లెట్లు తక్కువైతే ఏదైనా గాయం తగిలినపుడు అధికంగా రక్తస్రావం జరుగుతుంది. అయితే ఇలా కాకుండా రక్తస్రావాన్ని నిరోధించేందుకు ప్లేట్‌లెట్లు అనేవి కొత్తగా ఏర్పడేలా శాస్త్రవేత్తలు మూలకణాలతో చికిత్స చేయవచ్చని చెబుతున్నారు. ఎముక మూలుగలోని మూలకణాలతో ప్లేట్‌లెట్లను కొత్తగా ఉత్పత్తి చేయవచ్చని, దీనివల్ల ఇలా ప్లేట్‌లెట్ల కొరతను తీర్చవచ్చని చెబుతున్నారు.

ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు కొత్తరకం ఎముక మూలుగ మూల కణాలను గుర్తించారు. ఎలుకల్లో గుర్తించిన ఈ మూలకణాలతో రక్తం గడ్డకట్టుకోవడంలో కీలకమైన ప్లేట్‌లెట్లను భారీ ఎత్తున ఉత్పత్తి చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిశోధనతో కీమోథెరపీ, ఎముక మూలుగ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకునే వారిలో కొత్త తరహా చికిత్సలకు దారితీసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎముక మూలుగలోని మూలకణాల ద్వారా రక్తకణాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి తమంతట తామే పునరుద్ధరించుకుంటూ విభిన్న రకాల కణాలను ఉత్పత్తి చేస్తూ రక్త వ్యవస్థను సుసంపన్నం చేస్తాయి. ఎర్ర, తెల్ల రక్త కణాలతోబాటు ప్లేట్‌లెట్లు ఉత్పతన్నమవుతాయి. ఈ ప్లేట్‌లెట్లు అనేవి రక్తం కారిపోకుండా గడ్డకట్టేందుకు తోడ్పడతాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య తక్కువగా ఉంటే అధిక రక్త స్రావానికి దారితీస్తుంది. క్యాన్సర్‌ రోగుల్లో సర్వసాధారణంగా కనిపించే లక్షణం ఇదే. ఈ వ్యాధి రోగుల్లో సహజంగా ఉండే ప్లేట్‌లెట్ల రిజర్వాయర్‌ను వ్యాధిగానీ, చికిత్సగానీ దెబ్బతీస్తుంది. ఇది ప్రాణాంతక పరిస్థితిగా పరిణమిస్తుంది. వెంటనే కీమోథెరపీగానీ, ఎముక మూలుగ మార్పిడిగానీ చేయాల్సి ఉంటుంది. అయితే తాజా అధ్యయనంలో పరిశోధకులు ఎముక మూలుగలోని మూలకణాన్ని ఎలుకలోకి ప్రవేశపెట్టినప్పుడు వాటిలో ప్లేట్‌లెట్లు బాగా వృద్ధి అయినట్టు గుర్తించారు. ఈ కొత్త తరహా మూలకణాలు భారీ సంఖ్యలో ప్లేట్‌లెట్లను వృద్ధి చేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News