: కాంగ్రెస్ యూ టర్న్ తీసుకొంటే ఉద్యమించేందుకు తెరాస సిద్ధం: ఈటెల


తెలంగాణ అంశంపై కాంగ్రెస్ యూ టర్న్ తీసుకొంటే ఉద్యమించేందుకు తెరాస సిద్ధంగా ఉందని ఆ పార్టీ శాసనసభాపక్షనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ఈ రోజు కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో తెరాస ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజేందర్ మాట్లాడుతూ సీమాంధ్రలో కాంగ్రెస్, తెదేపాలు కృత్రిమంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ సీమాంధ్ర పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు అనుకూలమని లేఖ ఇచ్చామన్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందాకే కాంగ్రెస్ లో విలీనంపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News