: తిరుమల శ్రీవారిని దర్శంచుకున్న ఇస్రో ఛైర్మన్


తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి సేవలో ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణ న్ తరించారు. ఈ ఉదయం వీఐపీ దర్శన సమయంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. సోమవారం నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి పీఎస్ఎల్ వీ-సి20 రాకెట్ ను ప్రయోగిస్తున్నసందర్భంగా దాని నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి పూజలు చేశారు.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు. ప్రతి ప్రయోగానికి ముందు తిరుమల వెంకటేశ్వరుడిని రాధాకృష్ణ న్ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. 

  • Loading...

More Telugu News