: రగులుతున్న ఈజిప్టు... 43 మంది మృతి
పదవీచ్యుతుడైన ఈజిప్టు అధ్యక్షుడు మోర్సీకి మద్దతుగా కైరోలో ప్రదర్శనలు చేపట్టిన ఆందోళనకారుల శిబిరాలపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో 43 మంది మోర్సీ మద్దతుదారులు మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ముందుగా బాష్పవాయుగోళాలు ప్రయోగించి, ఆందోళనకారులుంటున్న రబా అల్ అదావియా శిబిరంపై దాడికి పాల్పడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వేలాదిగా ఉన్న ఆందోళనకారులు ఉన్న ఆ ప్రాంతం పోలీసుల దాడితో ఒక్కసారిగా భీతావహంగా మారింది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య చాలాసేపు ఘర్షణ జరిగిందని వారు తెలిపారు. ఆందోళనకారుల మరో శిబిరం అల్ నహదా స్క్వేర్ వద్ద కూడా ఇదే వాతావరణం నెలకొందని, పోలీసులు చాలావరకు టెంటులను పీకి పడేశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.