: బీమా భవన్లో మరోసారి ఉద్రిక్తత


తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగుల పోటాపోటీ నినాదాలతో హైదరాబాద్ అబిడ్స్ లోని బీమా భవన్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు దిగిన ఏపీఎన్జీవోలు సమైక్య నినాదాలు చేయడం, కాంగ్రెస్ నేతలు తులసిరెడ్డి, జనచైతన్య వేదిక నాయకుడు లక్ష్మణరెడ్డి వారికి మద్దతు తెలపడానికి బీమా భవన్ చేరుకోవడాన్ని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు వ్యతిరేకించారు. దీంతో ఇరు ప్రాంతాల ఉద్యోగులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరుప్రాంతాల ఉద్యోగులకి సర్ది చెప్పారు.

సకలజనుల సమ్మె సందర్భంగా బయటి నుంచి ఎవరినీ అనుమతించలేదని, ఆంధ్ర ప్రాంత ఉద్యోగుల్ని రెచ్చగొట్టేందుకు బయటి వ్యక్తులు వస్తున్నారని వారు తప్పుపట్టారు. అయితే తెలంగాణ ఉద్యోగుల వాదనలో వాస్తవం లేదని, వారు సమ్మెలో పాల్గొన్నప్పుడు తాము పూర్తిగా సహకారం అందించామని సీమాంధ్ర ఉద్యోగులు తెలిపారు. తెలంగాణ ఏర్పడకముందే ఈ పరిస్థితి ఉంటే, రాష్ట్రం ఏర్పడ్డాక ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. కనీసం తమకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News