: సమాజంలో మహిళలకు సరైన గుర్తింపు లేదు: పురందేశ్వరి
సమాజంలో మహిళలకు సరైన గుర్తింపు లభించడం లేదని కేంద్రమంత్రి పురందేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో జరుగుతున్న అఖిల భారతీయ లయన్స్ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో పురందేశ్వరి పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు జరిగితేనే రాజకీయరంగంలో కూడా మహిళలు ఎదిగే అవకాశం ఏర్పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. అధికారంతోనే మహిళలకు గుర్తింపు లభిస్తుందని పురందేశ్వరి అన్నారు.