: బాబుకు మెమరీ లాస్: శోభా నాగిరెడ్డి


వైఎస్సార్సీపీ నేతలు చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు గురిపెట్టారు. బాబుకు జ్ఞాపకశక్తి లోపించిందని ఆ పార్టీ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి అంటున్నారు. కర్నూలులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. తొలుత విభజనకు ఓటేసిన బాబు, తర్వాత, 4 లక్షల కోట్లిస్తే రాజధాని అభివృద్ధి చేసుకుంటామన్నాడని, అనంతరం రాష్ట్రం ఒక్కటిగా ఉండాలని కొత్త పల్లవి అందుకున్నాడని ఆమె ఆరోపించారు. బాబు తీరు చూస్తుంటే ఆయన మెమరీ లాస్ తో బాధపడుతున్నట్టుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో బాబుది కపటనాటకమని ఆమె విమర్శించారు.

  • Loading...

More Telugu News