: మారిన ఆంటోనీ కమిటీ షెడ్యూల్


కాంగ్రెస్ అధిష్ఠానం ఏర్పాటు చేసిన ఆంటోనీ కమిటీ షెడ్యూల్ మారింది. ఇవ్వాళ సాయంత్రం ఎనిమిది గంటలకు సీమాంధ్ర మంత్రులకు బదులు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఎంపీలు ఆంటోనీ కమిటీతో భేటీ అవనున్నారు. వాస్తవానికి ఈరోజు సీమాంధ్ర మంత్రులు, రేపు తెలంగాణ ప్రాంత ఎంపీలు సమావేశం అవ్వాల్సి ఉంది. షెడ్యూల్ మారడంతో నేతలకు అధిష్ఠానం నుంచి ఫోన్లు వెళ్లాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సి ఉందని పలువురు నేతలు మొరపెట్టుకోవడంతో ఈ మీటింగు షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. దాంతో, రేపు రాత్రి సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు ఆంటోనీ కమిటీతో భేటీ అవనున్నారు.

  • Loading...

More Telugu News