: అన్ని శాఖల అధికారులతో సీఎం సమీక్ష
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై అన్ని శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీమాంధ్ర జిల్లాల్లో ఏపీఎన్జీవోల సమ్మె, వ్యాపార సంస్థల బంద్ కారణంగా నిత్యావసర వస్తువుల రవాణాకు ఆటంకాలను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. జంట నగరాల మార్కెట్లకు వచ్చే సరుకుల పరిస్థితిని గమనించి, సమస్యలేవైనా తలెత్తితే వెంటనే అధిగమించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్ధిక మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.