: రైతుల వల్లే ఉల్లి లొల్లి


ఉల్లిపాయల ధరలు అనూహ్యంగా పెరగడానికి రైతులే కారణమని మహారాష్ట్ర సర్కారు ఆరోపిస్తోంది. ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ విషయంపై నిజనిర్ధారణ కమిటీ వేసింది. హోల్ సేల్ వ్యాపారస్తులు పెద్దమొత్తంలో ఉల్లి నిల్వ చేసి కృత్రిమంగా ధర పెరిగేలా చేశారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఈ కమిటీ తేల్చింది. రైతులే తమ పంటను ఒక్కసారిగా కాకుండా ధర పెరిగినప్పుడు కొద్దికొద్దిగా అమ్ముతున్నారని, అందుకే కొరత ఏర్పడిందని ఆ కమిటీ పేర్కొంది. రైతులు మాత్రం కమిటీ వాదనతో ఏకీభవించడం లేదు.

ఏ కొద్దిమంది రైతులో అలా చేస్తే సమస్య ఇంత తీవ్రం కాదన్నది వారి వాదన. ఉల్లి చాలాకాలం నిల్వ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా హోల్ సేల్ వ్యాపారులే పెద్ద ఎత్తున నిల్వ చేసి ఉంటారని, వాళ్ల సూచనలతోనే రిటైలర్లు ధరలు పెంచుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం చౌకధరల దుకాణాల ద్వారా తక్కువ ధరకు ఉల్లిపాయలను విక్రయించే ఆలోచనలో ఉంది.

  • Loading...

More Telugu News