: రేపు, ఎల్లుండి టీఎన్జీవో సద్భావన ర్యాలీలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండు చేస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో పది జిల్లాల్లో సద్భావన ర్యాలీలు నిర్వహించాలని టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యోగులందరూ ర్యాలీల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఉద్యమాలు, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాదుతో తెలంగాణను ముడిపెట్టి రాష్ట్ర ప్రక్రియను అడ్డుకోవద్దన్నారు.