: కాంగ్రెస్ లోకి నటుడు శ్రీహరి!
టాలీవుడ్ లో విలన్ గా ఎంటరై.. హీరోగా ప్రస్థానం సాగించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్న శ్రీహరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. రేపు తన జన్మదినాన్ని జరుపుకోనున్న శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. ఈక్రమంలో ఆయన వచ్చే ఎన్నికల్లో కూకట్ పల్లి, సనత్ నగర్ అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశముంది. ఒకవేళ కూకట్ పల్లి నుంచి పోటీ చేయాల్సి వస్తే రసవత్తర పోరు తథ్యమేననిపిస్తోంది.