: జలాంతర్గామి ప్రమాదంలో మరో తెలుగువ్యక్తి మృతి


ముంబయి నేవల్ డాక్ యార్డ్ లో నిలిపి ఉంచిన ఐఎన్ఎస్ సింధురక్షక్ జలాంతర్గామిలో ఈ వేకువజామున జరిగిన అగ్నిప్రమాదంలో మరో తెలుగు వ్యక్తి మరణించాడు. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నం వాసి దాసరి ప్రసాద్ కూడా ఈ ప్రమాదంలో అసువులు బాశాడు. ఇదే ప్రమాదంలో గంట్యాడకు చెందిన రాజేశ్ అనే సెయిలర్ కూడా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీంతో, విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు నేవీ సిబ్బంది మరణించడంతో ఈ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా, ఈ ఘటనలో మొత్తం 18 మంది మరణించినట్టు భావిస్తున్నారు. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సింధురక్షక్ జలాంతర్గామిని యార్డ్ లో నిలిపి ఉంచిన సమయంలో దాంట్లో హైడ్రోజన్, ఆక్సిజన్ వాయువులు లీకై అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని నేవీ వర్గాలు ఓ అంచనాకొచ్చాయి.

  • Loading...

More Telugu News