: ఎయిమ్స్ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు పట్ల లోక్ సభలో చర్చ


ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సిబ్బందికి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చ ఈరోజు లోక్ సభను దద్దరిల్లేలా చేసింది. స్పీకర్ మీరాకుమార్ క్వశ్చన్ అవర్ ఎజెండాను పక్కన పెట్టి ఈ అంశంపై చర్చకు అనుమతించగా, అన్ని పార్టీల సభ్యులు రాజ్యాంగ సవరణ తేవాలని సూచించారు. దీంతో, పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. అంతే కాకుండా ఈ తీర్పుపై ఆగస్టు 19 న రివ్యూ పిటీషన్ కూడా వేస్తామని ప్రభుత్వం లోక్ సభకు తెలిపింది.

  • Loading...

More Telugu News