: తెలుగులో శాంసంగ్ యాప్స్
మొబైల్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్ఠ పరచుకునేందుకు శాంసంగ్ 9 భారతీయ భాషలలో అప్లికేషన్లు, యూజర్ ఇంటర్ ఫేస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళీ, బెంగాలీ, మరాఠి, గుజరాతి, పంజాబి భాషలలో యాప్స్ ను పొందవచ్చు. ప్రస్తుతానికి గెలాక్సీ గ్రాండ్, ఎస్ 4, టాబ్ 3 లో ఈ సదుపాయాలు అందుబాటులో ఉన్నట్లు శాంసంగ్ వెల్లడించింది. ఈ నెల నుంచి గెలాక్సీ స్టార్ లోనూ ప్రాంతీయ భాషల్లో కంటెంట్ పొందవచ్చని పేర్కొంది.
భారత్ మ్యాట్రిమోనీ, గణేశ్ స్పీక్, ఇండియన్ ప్రాపర్టీ, టైమ్స్ ఆఫ్ ఇండియా, బీఎస్ఈ, మైడాలా.. ఇలా 100 యాప్స్ ను త్వరలోనే ప్రాంతీయ భాషల్లో అందించనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది.