: తులసిరెడ్డిని అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగుల సంఘం
హైదరాబాదులోని విద్యుత్ సౌధ వద్ద తెలంగాణ ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్ నేత తులసిరెడ్డిని అడ్డుకున్నాయి. నిరసన తెలుపుతున్న సీమాంధ్ర ఉద్యోగులకు సంఘీభావం ప్రకటించేందుకు తులసిరెడ్డి రాగా.. ఆయన వాహనాన్ని తెలంగాణ ఉద్యోగులు అడ్డుకున్నారు. వ్యతిరేకంగా నినాదాలు చేసి, నల్లజెండాలు ప్రదర్శించారు. దాంతో, విద్యుత్ సౌధలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.