: లోక్ సభ మళ్లీ వాయిదా
లోక్ సభ మళ్లీ వాయిదా పడింది. తొలి వాయిదా తరువాత మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్ సభలో సీమాంధ్ర టీడీపీ ఎంపీలు ఆందోళనలు చేయడంతో స్పీకర్ వాయిదా వేశారు. ఆహారభద్రతపై చర్చసాగుతున్న సమయంలో టీడీపీ ఎంపీల 'వీ వాంట్ జస్టిస్' నినాదాలతో లోక్ సభ దద్దరిల్లింది. దీంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు.