: మహిళపై పోలీసుల అత్యాచారం


ఉత్తరప్రదేశ్ లో అరాచక రాజ్యం నడుస్తుందా? అని అనిపించేలా మరో మహిళపై లైంగిక దాడి జరిగింది. ఈసారి పోలీసులే మహిళపై అత్యాచారం చేయడం దారుణం. షామ్లీ జిల్లా గంగేరు గ్రామంలో 30 ఏళ్ల మహిళపై ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు దీపక్ రాఠి, వికాస్ చౌదరి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వీరిద్దరు మహిళ ఇంటికి వెళ్లి అత్యాచారం చేసినట్లుగా డీఎస్పీ సీపీ సింగ్ మీడియాకు తెలిపారు. బాధితురాలి ఇంట్లో నగదు, ఆభరణాలను కూడా దోచుకున్నారని చెప్పారు. అనంతరం ఎవరికైనా చెబితే చంపేస్తామంటూ ఆమెను బెదిరించారని తెలిపారు. మరోవైపు, ఆ ఇద్దరు రాక్షస పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ధర్నా చేశారు.

ఉత్తరప్రదేశ్ లో యువకుడు, విద్యావంతుడైన అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో పరిస్థితులు మారిపోతాయని చాలామంది ఊహించారు. గతంలో అఖిలేశ్ తండ్రి ములాయం, బీఎస్పీ అధినేత్రి మాయావతి హయాంలో అరాచక శక్తులు చెలరేగిన సంగతి తెలిసిందే. కానీ, తానూ అదే వనంలోని మొక్కనంటూ అఖిలేశ్ నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు దేశంలో అత్యధికంగా అత్యాచారాలు, హత్యలు, దాడులు జరుగుతున్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటుంది.

  • Loading...

More Telugu News