: టాలీవుడ్ లో 'తెలంగాణ సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్' ఏర్పాటు
రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో టాలీవుడ్ లో మరో ఫిల్మ్ ఛాంబర్ ఏర్పడబోతోంది. అదే'తెలంగాణ సినిమా ఛాంబర్ ఆఫ్ కామర్స్'. దీనికి దర్శకుడు, నిర్మాత ఎన్.శంకర్ నేతృత్వం వహించబోతున్నారు. ఈ శుక్రవారం (16వ తేదీన) నాడు దీనికి రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు జరగబోతున్నాయి. తెలంగాణ సినిమాను, కళాకారులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం. దీనికోసం ఎప్పటినుంచో ఆయన చేసిన ప్రయత్నాలు ఓ కొలిక్కి రావడంతో ఛాంబర్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది. ఈ ఛాంబర్ కు సంబంధించి దర్శకుల సంఘం అధ్యక్షుడిగా అల్లాణి శ్రీధర్ వ్యవహరిస్తారు. ఇదే కాకుండా, ఇప్పటికే తెలంగాణలో రెండు ఫిల్మ్ ఛాంబర్లు ఉండటం గమనార్హం. 'ది తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్', 'తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్' పేరిట ఇవి కార్యకలాపాలు సాగిస్తున్నాయి.