: ప్రమాదస్థలిని సందర్శించిన నేవీ చీఫ్


నిన్న అర్థరాత్రి ముంబయి నేవల్ డాక్ యార్డులో నిలిపి ఉంచిన ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. కాగా, పేలుడు ధాటికి సింధు రక్షక్ జలాంతర్గామి చాలా భాగం దెబ్బతినగా, 18 మంది సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఉదయం నేవీ చీఫ్ డీకే జోషి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు బోర్డ్ ఆఫ్ ఎంక్వయిరీని నియమిస్తున్నట్టు తెలిపారు. సాయంత్రానికల్లా రక్షణ శాఖ మంత్రి ఏకే ఆంటోనీ సంఘటనా స్థలిని సందర్శించే అవకాశముంది.

  • Loading...

More Telugu News