: కిష్త్వాడ్ అల్లర్లలో గాయపడ్డవారికి 2 లక్షలు చెల్లించాల్సిందే: సుప్రీం


జమ్మూకాశ్మీర్లోని కిష్త్వాడ్ మత ఘర్షణలలో గాయపడ్డవారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాల్సిందేనని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు, గాయపడ్డవారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించాలని కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, న్యాయ విచారణ పూర్తయ్యే వరకూ గాయపడ్డవారికి పరిహారం చెల్లించలేమంటూ జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు తోసిపుచ్చింది. గాయపడ్డవారూ పరిహారానికి అర్హులేనని, వారికి అర్హత లేదని ఎలా చెబుతున్నారంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సదాశివం ఆధ్వర్యంలోని ధర్మాసనం నిలదీసింది. ఈ కేసులో మంగళవారం జారీ చేసిన ఆదేశాలను సవరించేది లేదని తేల్చి చెప్పింది.

  • Loading...

More Telugu News