: నిజంగా నాకిది సంతోష సమయం: కోహ్లీ


క్రీడల్లో ప్రముఖ అవార్డుగా పరిగణించే అర్జున పురస్కారానికి కమిటీ తనను ఎంపిక చేయడం పట్ల క్రికెటర్ విరాట్ కోహ్లీ సంతోషం వ్యక్తం చేశాడు. అర్జున అవార్డును పొందడం నిజంగా చాలా సంతోషకరమన్నాడు. అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. అర్జున అవార్డుల ఎంపిక కమిటీ నిన్న ఎంపిక చేసిన తుది 15 మంది క్రీడాకారులలో కోహ్లీ పేరు కూడా ఉంది.

మరోవైపు హర్బజన్ సింగ్, కోహ్లీకి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. భవిష్యత్తులో కోహ్లీ మరిన్ని అవార్డులు సాధించాలని ఆకాంక్ష వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News