: 'ఆహార భద్రత బిల్లు'పై లోక్ సభలో నేడు చర్చ.. సోనియా మాట్లాడే ఛాన్స్


కేంద్రం తాను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రత బిల్లును ఈరోజు లోక్ సభలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు దీనిపై సభలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు, సభలో బిల్లును వ్యతిరేకించకుండా ఇప్పటికే పార్టీ ఎంపీలకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు కొందరు మాట్లాడుతూ, రాష్ట్రంపై స్పష్టమైన ప్రకటన చేయకుండా, బిల్లుకు మద్దతివ్వమంటే ఎలా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎంపీ హర్షకుమార్ నివాసంలో భేటీ అయిన సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చర్చిస్తున్నారు. పేదలకు ఉపయోగపడే బిల్లును వ్యతిరేకించాలని తామనుకోవడంలేదని చెప్పారు. పార్టీ తమకు హామీ ఇస్తే బిల్లు ఓటింగులో పాల్గొంటామని తెలిపారు.

  • Loading...

More Telugu News