: హైదరాబాదులో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టిన టీడీపీ
బాంబు దాడులకు వ్యతిరేకంగా హైదరాబాద్ లుంబినీ పార్కు దగ్గర తెలుగుదేశం పార్టీ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది. దాడులకు పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత సింగిరెడ్డి శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు. బాంబు పేలుళ్లలో గాయపడ్డవారిని ప్రైవేటు ఆసుపత్రుల నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.