: కంటిపాపతో కనిపెట్టేయొచ్చు


మనకు వచ్చే జబ్బులను ముందుగా కనిపెట్టేలా శాస్త్రవేత్తలు పలురకాలైన పరీక్షలను అభివృద్ధి చేస్తున్నారు. అయితే రక్తపోటు పెరిగితే పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని చాలామంది చెబుతుంటారు. ప్రమాదకరమైన పక్షవాతం ఎవరికి వస్తుంది? అనే విషయాన్ని మాత్రం గుర్తించడం కష్టం. అయితే ఈ విషయాన్ని మన కంటిపాప చెబుతుందట. మనకు పక్షవాతం వస్తుందా... రాదా? అనే విషయాన్ని మన కంటిపాపను పరీక్షించడం ద్వారా చెప్పేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

సింగపూర్‌ జాతీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్యుడు మొహమ్మద్‌ కమ్రాన్‌ ఇక్రామ్‌ కంటిపాపను ఫోటో తీయడం ద్వారా అధిక రక్తపోటు వల్ల వచ్చే పక్షవాతం ప్రమాదాన్ని ముందుగా పసిగట్టవచ్చని చెబుతున్నారు. ఇందుకు కంటిపాపను ముందుగానే ఫోటో తీయడం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన చెబుతున్నారు. కంటిపాపలోని రెటీనా మెదడులోని నరాల ఆరోగ్యాన్ని గురించి ఇట్టే చెబుతుందని ఆయన చెబుతున్నారు. కమ్రాన్‌ ఇక్రామ్‌ 13 ఏళ్లపాటు 2,907 మంది రోగులపై పరిశోధన చేశారు. ఈ పరిశోధనలో భాగంగా ఆయన ముందుగానే వారి కంటి రెటీనా ఫోటోలను తీసుకున్నారు. ఈ ఫోటోలద్వారా 'హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి'ని పసిగట్టిన రోగుల్లో పక్షవాతం వచ్చే ప్రమాదం 35 నుండి 137 శాతం వరకూ నమోదైందని ఇక్రామ్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News