: మోపిదేవికి తప్పని నిరాశ
అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ కోరుతున్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు నిరాశ తప్పలేదు. జగన్ అక్రమాస్తుల కేసులో రిమాండ్ అనుభవిస్తున్న మోపిదేవి.. తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని, చికిత్స కోసం ఆరు నెలలు బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ చేపట్టిన నాంపల్లి సీబీఐ న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు విన్నది. మధ్యంతర బెయిల్ పై తీర్పును ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. కాగా, ప్రత్యేక వైద్య సేవలు పొందడంతో పాటు విశ్రాంతి తీసుకోవాలని ప్రభుత్వ వైద్యులు సూచించారని మోపిదేవి తరుపు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు.