: కేసీఆర్ ఫాంహౌస్ లో టీఆర్ఎస్ నేతల భేటీ
తెలంగాణ ప్రకటన తదనంతర పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఉద్యమబాట పట్టాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజన ప్రక్రియ మొదలు పెడుతున్నామని కేంద్రం ప్రకటించడంతో సీమాంధ్రలో ఉద్యమం ఊపందుకోగా, తొలుత తెలంగాణకు అంగీకరించిన పార్టీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ కోసం టీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతలు కేసీఆర్ ఫాం హౌస్ లో సమావేశమయ్యారు. ఈ నెల 16న తెలంగాణ పొలిటికల్ జేఏసీ సమావేశం జరగనుండగా, ఆ భేటీలో ఎలాంటి కార్యాచరణ అనుసరించాలన్న దానిపైనా నేటి ఫాంహౌస్ సమావేశంలో చర్చించనున్నారు.