: డీజీపీ మేనల్లుడినంటూ సెటిల్ మెంట్లకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్టు


డీజీపీ దినేష్ రెడ్డి మేనల్లుడినంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. ఏసీపీ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కు చెందిన సింగరాజు వెంకటరమణ కుమార్ అలియాస్ రాజు తాను డీజీపీ మేనల్లుడినంటూ రంగారెడ్డి జిల్లా మాదాపూర్ లో భూవివాదాల్లో తలదూర్చి సెటిల్ మెంట్లకు పాల్పడుతున్నాడు. మాదాపూర్ లో ఎకరం భూ వివాదం కేసులో మణిప్రసాద్, రాములపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. వీరిపై ఫిర్యాదు చేసిన ఎల్.ప్రకాశరావుని డీజీపీ బంధువునంటూ పలుమార్లు బెదిరించాడని పోలీసులు పేర్కొన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.

  • Loading...

More Telugu News