: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పటిష్ట బందోబస్తు: కమిషనర్


హైదరాబాదులో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నిఘావర్గాల సమాచారం మేరకు నగర వ్యాప్తంగా చాలా చోట్ల పోలీసు బలగాల్ని మోహరించినట్టు తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ కు వచ్చే అన్ని మార్గాల్లో తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకల నిమిత్తం 10 మంది ఏసీపీలతో పాటు 25 మంది సీఐలను.. 76 మంది సబ్ ఇన్ స్పెక్టర్లతో పాటు ఏపీఎస్పీ, ఏఆర్ బలగాల్ని పరేడ్ గ్రౌండ్ చుట్టూ మోహరించినట్టు తెలిపారు. ఆగస్టు 15 ఉదయం నుంచి 11 గంటల వరకు పరేడ్ గ్రౌండ్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News