: రాయల నేతలే సీమను నాశనం చేశారు: బైరెడ్డి


రాష్ట్రాన్ని విభజించాక ఇప్పుడందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ అధినేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు ఏం చేసినా 'సరే' అన్నవారు ఇప్పుడు ప్రజలు తంతారని విభజనపై యూ టర్న్ తీసుకుని లేఖలు రాస్తున్నారన్నారు. ఆనాడు వైఎస్, చంద్రబాబే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని విభజనవాదాన్ని పాలుపోసి పెంచారని మండిపడ్డారు. రాజధాని ఏమవుతోందో అని ఇవ్వాళ ఆందోళనపడటంలో ఎంత న్యాయం ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు కిరణ్ కూడా అదే బాటలో ఉన్నారని ఆరోపించిన బైరెడ్డి వీరు ముగ్గురు రాయల నేతలే అయినా సీమను నాశనం చేశారని తిట్టి పోశారు. సీమ పాలిట వీరు ముగ్గురు మహా మోసగాళ్లని విమర్శించారు.

కరెంటు ఉందని చెప్పుకుంటున్న కిరణ్ కు సీమలో పవర్ లేక 25వేల మంది రైతులు టైలర్లుగా మారారన్న సంగతి తెలియదా? అని సూటిగా ప్రశ్నించారు. వాస్తవంగా చెప్పాలంటే రాష్ట్రంలో అసలు కరెంటే లేదని, లేనిపోని లెక్కలు చెబుతూ కపట ప్రేమ చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసి రాయలసీమను నాశనం చేశారని ధ్వజమెత్తారు. వీటన్నింటినీ రాయలసీమ ప్రజలు గమనిస్తున్నారని, సరైన బుద్ధి చెబుతారన్నారు.

  • Loading...

More Telugu News