: భారత్ తో కొత్తగా చర్చలు ప్రారంభిస్తామంటున్న పాక్


సరిహద్దు ప్రాంతంలో పలుమార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాకిస్తాన్.. భారత్ తో కొత్తగా చర్చలు ప్రారంభిస్తానంటూ ముందుకొచ్చింది. దీనివల్ల భారత్, పాక్ దేశాల మధ్య స్నేహ సంబంధాలు మెరుగవుతాయని ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పేర్కొన్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ ఆఫ్ పాకిస్తాన్ (ఏపీపీ) తన కథనంలో పేర్కొంది. సరిహద్దులో జరుగుతున్న ఘటనలపై ఇరుదేశాలు శాంతి, స్నేహభావంతో చర్చించుకోవాలని షరీఫ్ కోరినట్లు తెలిపింది. కాగా, వచ్చేనెల పాక్ తో భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జరుపనున్న చర్చల్లో సరిహద్దు అంశం కూడా ఒకటి.

  • Loading...

More Telugu News