: అగస్టా హెలి స్కాంలో అవకతవకలు జరిగాయి: కాగ్


అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందంలో రక్షణశాఖ నిబంధనలు ఉల్లంఘించిందని పార్లమెంటుకు అందించిన నివేదికలో కాగ్ పేర్కొంది. కొనుగోలు వ్యవహారంలో తొలుత రూ.3,966 కోట్లకు ఒప్పందం కుదిరిందని, అయితే, ఆ తర్వాత రూ.4,871.5 కోట్లు చెల్లించినట్లు కాగ్ తెలిపింది. ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఐఏఎఫ్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగిని ఇప్పటికే సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News