: పాకిస్థాన్ లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్
రెండు రోజుల పర్యటనలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సతీ సమేతంగా పాకిస్థాన్ కు ఈ రోజు చేరుకున్నారు. పాక్ పెట్రోలియం మంత్రి షాహిద్ ఖఖాన్ తదితరులు బాన్ దంపతులకు ఇస్లామాబాద్ లో స్వాగతం పలికారు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని నవాజ్ షరీఫ్, ఇతర అధికారులతో బాన్ సమావేశమవుతారు. అలాగే, రేపు జరగనున్న పాక్ స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరవుతారు. తన పర్యటనలో భాగంగా బాన్ శాంతి, విద్యా, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై పాక్ నేతలతో చర్చిస్తారు.