: నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు నిరసన: గంటా
మంత్రి గంటా శ్రీనివాసరావు ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడారు. పార్లమెంటు ఆవరణలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతల ధర్నాలో పాల్గొన్న ఆయన, నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు నిరసనను విభిన్న రూపాలలో తెలుపుతామని స్పష్టం చేశారు. వాస్తవ పరిస్థితిని అధిష్ఠానం అర్థం చేసుకుని నిర్ణయం వాపసు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న సమ్మె విజయవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ప్రజలే నడిపిస్తున్న ఉద్యమమని, నేతలు కూడా అందులో పాల్గొనాల్సి వచ్చిందంటే, ఆ ఉద్యమ తీవ్రత ఎంతో అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు.