: బ్రిటన్లో భారతీయులే కింగ్ మేకర్లు?
ఒకప్పుడు భారతీయులను బానిసలుగా చేసుకుని పాలించింది బ్రిటిష్ రాజ్యం. ఇప్పుడు అదే బ్రిటన్లో భారతీయులు ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను శాసించే స్థాయికి చేరుకున్నారు. బ్రిటన్ లో 2015లో ఎన్నికలు జరగనుండగా, మొత్తం 650 స్థానాలలో 175 చోట్ల భారతీయుల జనాభా చెప్పుకోదగ్గ స్థాయికి చేరింది. అంటే అక్కడ మనవారి దయపైనే గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. ఇక 203 నియోజకవర్గాలలో నల్ల జాతి, మైనారిటీ వర్గీయుల జనాభా.. ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించనున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.