: గూగుల్, ఫేస్ బుక్ పై విచారణను నిలిపివేసిన ఢిల్లీ కోర్టు


గూగుల్, ఫేస్ బుక్, ఆర్కుట్, యూట్యూబ్, యాహూ, మైక్రోసాఫ్ట్ సహా 13 వెబ్ సైట్లపై విచారణను ఢిల్లీ కోర్టు నిలిపివేసింది. ఈ వెబ్ సైట్లు దేశ సమగ్రతను దెబ్బతీస్తున్నాయంటూ ఉద్యమకర్త వినయ్ రాయ్ లోగడ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసభ్యకరమైన సమాచారాన్ని, వస్తువులను విక్రయిస్తున్నాయంటూ అందులో ఆరోపించారు. దీంతో ఆయా వెబ్ సైట్లకు కోర్టు సమన్లు జారీ చేసింది. తాజాగా, ఈ వెబ్ సైట్లకు సమన్లు జారీ చేయడానికి అమెరికా న్యాయశాఖ నిరాకరించిందని, అందుకే విచారణను నిలిపివేయాల్సి వచ్చిందని కోర్టు పేర్కొంది.

  • Loading...

More Telugu News