: లాలూకు చుక్కెదురు


పశుదాణా స్కామ్ లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేసేందుకు సుప్రీం నిరాకరించింది. వివరాల్లోకెళితే.. పశుదాణా కేసు విచారణను రాంచీలోని సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. ఈ కోర్టు జడ్జి పీకే సింగ్ కు నితీశ్ కుమార్ ప్రభుత్వంలోని విద్యాశాఖ మంత్రి పీకే షాహితో బంధుత్వం ఉన్నందున కేసును మరో బెంచ్ కు బదిలీ చేయాలని లాలూ కోరుతున్నారు. ఈ మేరకు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం ఆధ్వర్యంలోని ధర్మాసనం కేసు విచారణను మరో బెంచ్ కు బదిలీ చేయడానికి నిరాకరించింది. 2011 నుంచి విచారణ కొనసాగుతుంటే, ఇప్పుడు బెంచ్ మార్చాలని కోరడంపై ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. కేసు విచారణను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి తీర్పు వెలువరించాలని సుప్రీం.. సీబీఐ కోర్టుకు సూచించింది.

  • Loading...

More Telugu News