: ఉగ్రవాద దాడుల భయంతో ఢిల్లీలో భారీ భద్రత
దేశ రాజధాని ఢిల్లీలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశాలున్నాయంటూ ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి హెచ్చరికలు రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. సున్నిత ప్రాంతాలుగా గుర్తించిన చోట అదనంగా పోలీసులను నియమించారు. షార్ప్ షూటర్లు, ఎన్ఎస్ జీ కమెండోలు ఎర్రకోట సమీప ప్రాంతాలలో కాపలా కాస్తున్నారు. నగరంలోకి ప్రవేశించే వాహనాలన్నింటిని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు ఢిల్లీ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్ శుక్లా తెలిపారు.