: భారత్ లో కొత్త ప్రభుత్వంతోనూ కలిసి సాగుతాం: అమెరికా
భారత్ లో 2014 ఎన్నికల తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా వారితో కలిసి సాగుతామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. ఎవరు గెలుస్తారన్న దానితో తమకు పనిలేదని, ఎవరు అధికారంలోకి వచ్చినా ఇరు దేశాల మధ్య అనుబంధం కొనసాగుతుందని, కలిసి పనిచేస్తామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మారీ హర్ప్ ప్రకటించారు.