: భూమిని ఢీకొట్టనున్న ఉల్కలు
అంతరిక్షంనుండి భూమిపైకి పలు ఉల్కలు వచ్చి పడుతుంటాయి. ఇప్పుడు మరో 20 ఉల్కలు భూమి దిశగా వస్తున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉల్కలు ఢీకొట్టడం వల్ల ఆ ప్రాంతాల్లో ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
మ్యాడ్రిడ్‌లోని కంప్లూటెన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో భూమిని ఢీకొనేందుకు 20 దాకా ఉల్కలు అంతరిక్షంనుండి వస్తున్నాయని గుర్తించారు. రష్యాలోని చెల్యాబినిస్క్‌లో ఈ ఏడాది ప్రారంభంలో విస్ఫోటనం చెందిన ఉల్కలాంటివి మరో 20 దాకా భూమివైపు వస్తున్నాయని స్పానిష్ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గతంలో భూమిని ఢీకొన్న ఉల్క నిజానికి ఒక పెద్దకుటుంబంలో భాగమని, అందులోని మిగిలిన శిలలు వందేళ్ల కాలవ్యవధిలో భూమిని ఢీకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.