: నెహ్రూ పెళ్లి చేస్తే.. సోనియా విడాకులిచ్చింది: హరికృష్ణ


'తెలుగు వారి విభజనపై జరుగుతున్న చర్చలో పాల్గొనడం నా దురదృష్టం' అని నందమూరి హరికృష్ణ అన్నారు. 'భారతీయుడినైనా తెలుగువాడిగా నా మాతృ భాషలోనే మాట్లాడుతా'నని ఆయన తెలిపారు. దానికి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ మాట్లాడుతూ 'నేను చైర్లో ఉండగా నాకు మీరు మాట్లాడేది ఏంటో తెలియాలి కదా?' అని ప్రశ్నించారు. 'మీరు వాడేది పార్లమెంటరీ భాషో అన్ పార్లమెంటరీ భాషో నాకు తెలియాలి' అంటూ హిందీ లేదా ఇంగ్లీష్ లో మాట్లాడాలని సూచించారు. దీంతో 'ఇక్కడ తెలుగు, కర్ణాటక, తమిళనాడు, హిందీ భాష వారు ఉన్నారు. కానీ వారికి లేనిది నా భాషకే అవమానమా' అని హరికృష్ణ ప్రశ్నించారు.

తాను తెలుగులోనే మాట్లాడుతానని పట్టుబట్టారు. అనంతరం మాట్లాడుతూ.. మహానుభావులు పుట్టిన పుణ్యభూమి భారత దేశంలో ఉన్నాం కానీ ఎవరి కన్ను పడిందో తెలీదు సుభిక్షంగా ఉన్న మా సోదరులం విడిపోవాల్సిన దుస్థితి ఏర్పడిందసన్నారు. ఓ కుటుంబంలో విడిపోతే ఇద్దర్నీ పిలిచి అభిప్రాయాలు అడుగుతారు కానీ, మా దుస్తుతేంటంటే కనీసం మమ్మల్నెవరూ సంప్రదించలేదని ఆరోపించారు. దేశం నుంచి వెళుతూ వెళుతూ ఆంగ్లేయులు అర్ధరాత్రి స్వాతంత్ర్యం ప్రకటించినట్టు, అర్ధరాత్రి రాష్ట్రాన్ని ముక్కలు చేశారని మండిపడ్డారు. విభజన ప్రకటనతో రాష్ట్రం అట్టుడుకుతోందని, దానికి బాధ్యులెవరని హరికృష్ణ ప్రశ్నించారు. 'ఆంధ్రప్రదేశ్ కు నెహ్రూ పెళ్లి చేస్తే.. సోనియా విడాకులిచ్చిందని' ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News